Home Page SliderNationalPolitics

ఆసుపత్రిలో చేరిన ఎల్‌కే అద్వాణీ

బీజేపీ కురువృద్ధుడు, సీనియర్ నేత ఎల్‌కే అద్వాణీ తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 97 సంవత్సరాలు. అనేక వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఆయన తరచూ అనేక సార్లు ఆసుపత్రిలో చేరారు. ఆయనను ఇటీవల భారత రత్న పురస్కారంతో గౌరవించిన సంగతి తెలిసిందే.