వామ్మో.. థమ్స్ అప్ లో బల్లి అవశేషాలు
తాగిన కూల్ డ్రింక్ బాటిల్లో బల్లి కనిపిస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఓ సారి ఊహించుకోండి. అలాంటిదే ఓ ఘటన తాజాగా సంగారెడ్డి (డి) పెద్దాపూర్ లోని ఓ హోటల్లో జరిగింది. ఆ హోటల్లో యువకులు థమ్స్ అప్ కూల్ డ్రింక్ తాగారు. సగం కూల్ డ్రింక్ తాగిన తర్వాత వారు గమనించారు. థమ్స్ అప్ లో బల్లి కాలు కనిపించడంతో వారు షాక్ కు గురయ్యారు. హోటల్ సిబ్బందితో గొడవపడ్డారు. వారిలో ఒకరు అస్వస్థతకు గురైన యువకుడికి అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు.