మెహఫిల్ బిర్యానీలో బల్లి
తెలంగాణలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ సాగర్ రహదారిపై ఉన్న మెహఫిల్ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో కస్టమర్ చికెన్ బిర్యానీ తింటుండగా బిర్యానీలో బల్లి ప్రత్యక్షమైంది. బల్లి రావడంతో ఒక్కసారిగా కస్టమర్ కంగుతిన్నాడు. ఇదేమిటని రెస్టారెంట్ యజమానిని నిలదీశాడు. అయితే.. రెస్టారెంట్ యజమాని మంచిగా ఫ్రై అయింది తిను అని చెప్పడంతో బాధితుడు ఆగ్రహానికి గురయ్యాడు. గుజ్జా కృష్ణ రెడ్డి షేరిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మేనేజర్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

