రామ్ చరణ్ ఆస్తుల చిట్టా..!
RRR తెలుగు తారలను అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతలు పొందడానికి కారణమయ్యింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు సినిమాను ప్రపంచ పటంలో ఉంచింది. RRR, నాటు పాట ఆస్కార్ అవార్డును సైతం గెలుచుకొంది. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు, రామ్ చరణ్ ఆస్తి గురించి, సినిమాలు, ఆదాయం గురించి, ఆయన వాడే కార్ల గురించి నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. చరణ్ ఎలాంటి కార్లను వినియోగిస్తున్నాడు ఇలాంటి విషయాలపై అభిమానులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు.

చిరుత సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన చరణ్ మగధీరతో బాక్సాఫీస్ బద్దలు కొట్టి ట్రిపుల్ ఆర్‌తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఖైదీ నంబర్ 150 చిత్రంతో నిర్మాతగా కూడా విజయాన్ని సాధించాడు. సినిమాలే కాకుండా, పెప్సీ, అపోలో జియా, హీరో మోటోక్రాప్, ఫ్రూటీ వంటి దాదాపు 34 బ్రాండ్‌లకు ఎండార్స్ చేయడం ద్వారా కూడా చరణ్ సంపాదిస్తున్నాడు. రామ్ చరణ్ ఆస్తులు దాదాపు 1,370 కోట్ల రూపాయలు. నెలవారీ ఆదాయం 3 కోట్ల కంటే ఎక్కువ. ట్రిపుల్ సినిమాలో చరణ్ తన పాత్ర కోసం 45 కోట్ల రూపాయలను పారితోషకంగా తీసుకున్నట్లు ప్రచారం ఉంది. భారతదేశంలో అత్యధికంగా పన్ను చెల్లించేవారిలో రామ్ చరణ్ కూడా ఒకరు.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రామ్‌చరణ్‌కు దాదాపు 25,000 చదరపు అడుగుల బంగ్లా ఉంది. ఈ ఇంట్లో స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్, టెంపుల్, జిమ్, ఫిష్ పాండ్ వంటి అధునాతన సౌకర్యాలు ఉన్నాయి. రామ్ చరణ్ ఇంటి విలువ దాదాపు 38 కోట్లు ఉంటుందని అంచనా. ఇది కాకుండా రామ్ చరణ్‌కు ముంబైలో పెంట్ హౌస్ కూడా ఉంది. రామ్ చరణ్ వాడే వాహనాల విషయానికి వస్తే, దాదాపు రూ. 4 కోట్ల విలువైన కస్టమైజ్డ్ మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600, ఆడి మార్టిన్ V8 వాంటేజ్, రోల్స్ రాయిస్ ఫాంటమ్, రేంజ్ రోవర్, ఆస్టన్ మార్టిన్, ఫెరారీ పోర్టోఫినోలను కలిగి ఉన్నాడు. చరణ్‌కి ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉంది.