లిక్కర్ స్కామ్‌లో డబ్బు ఎక్కడ ఉందో బయటపెడతారు: అరవింద్ కేజ్రీవాల్ భార్య
ఆమ్ ఆద్మీ పార్టీని కుదిపేసిన ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో అరవింద్ కేజ్రీవాల్ సంచలన విషయాలను వెల్లడిస్తారన్నారు ఆయన భార్య సునీత. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మార్చి 28న పెద్ద ప్రకటన చేయనున్నారని చెప్పారు. మద్యం కుంభకోణంలో డబ్బు ఎక్కడిదన్నదానిపై మార్చి 28న దేశమంతటా చెబుతారన్నారు. లోక్ సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందు ముఖ్యమంత్రి అరెస్టుపై ఆప్ తీవ్రంగా ఆక్షేపిస్తోంది. గత వారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేశాక, ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. “మద్యం కుంభకోణం” అని పిలవబడే డబ్బు ఎక్కడ ఉందో వెల్లడిస్తారని ఆమె చెప్పారు.

