పవన్ వారాహికి లైన్ క్లియర్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు పోలీసుల అనుమతి లభించిందని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వారాహి వాహన యాత్రకు అనుమతి కోరారని పేర్కొన్నారు. కానీ పూర్తి స్థాయిలో పవన్ కార్యక్రమంపై తమకు సమాచారం లేదన్నారు. రేపటి నుండి ఉభయ గోదావరి జిల్లాలో పవన్ చేయబోతున్న వారాహి యాత్ర జరుగుతుందా, అమలాపురంలో పవన్ బహిరంగసభకు అనుమతి ఉండదేమో అనే అనుమానాలు క్లియరయ్యాయి. పవన్ పాల్గొనబోయే యాత్రలకు, బహిరంగసభలకు అనుమతి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలు పాటిస్తూ సభలు నిర్వహించుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపటి నుండి వారాహి ప్రజల్లో షికారు చేయనుంది. కాగా వారాహి యాత్రకు పలువురు సినీప్రముఖులు తమ మద్దతు తెలిపారు. పవన్ కళ్యాణ్ విజయవాడ పరిసర ప్రాంతాలలో ఉండడంతో తమ షూటింగ్‌లు కూడా ఈ ప్రదేశాలలోనే ఉంటాయని డైరక్టర్ హరీష్ శంకర్ తెలిపారు. అన్నవరం సత్యనారాయణ స్వామిని కూడా పవన్ దర్శనం చేసుకోబోతున్నట్లు సమాచారం.

