స్పోర్ట్స్ వర్సిటీకి లైన్ క్లియర్..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో స్పోర్ట్స్ వర్సిటీ బిల్లును ఆమోదించారు. దీనితో దీనికి లైన్ క్లియర్ అయ్యింది. బీజేపీ, బీఆర్‌ఎస్ సభ్యుల నిరసనల మధ్య కాంగ్రెస్ ఎమ్మెల్యేలే స్పోర్ట్స్ వర్సిటీ బిల్లును ఆమోదించారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ బిల్లుకు కూడా ఆమోదం లభించింది. దీనితో ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లును ఆమోదించినట్లయ్యింది.