మీలా నేను కూడా ఈ హాస్టల్ లోనే చదువుకున్నా..
తాను ములుగు గిరిజన సంక్షేమ హాస్టల్లో ఉండి స్థానిక గర్ల్స్ హైస్కూల్లో విద్యాభ్యాసం చేశానని, సంక్షేమ హాస్టల్లు, ఆశ్రమ గురుకులాల సమస్యలు తనకు తెలుసని మంత్రి సీతక్క అన్నారు. ములుగు సంక్షేమ హాస్టల్ విద్యార్థినులతో కలిసి నేలపై కూర్చొని ఆమె అల్పాహారం చేశారు. తాను ఇదే హాస్టల్ లో ఉన్నానని గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె హాస్టల్లో వసతులు భోజనం ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసుకుని కొలువులు సాధించాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.