home page sliderHome Page SliderTelangana

పిడుగు పడి సుమారు 14 నిమిషాల పాటు అలాగే వెలుతురు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. పలుచోట్ల ఈదురుగాలులతో పిడుగులు పడ్డాయి. తాజాగా తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. పిడుగు పడి సుమారు 14 నిమిషాల పాటు అలాగే వెలుతురు ఉండిపోయింది. భారీ అకాల వర్షానికి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం శ్రీలంక కాలనీ లోని ఖాళీ ప్రదేశములో పిడుగు పడింది. సుమారు14 నిమిషాల పాటు అలాగే వెలుతురు నిచ్చింది. ఖాళీ స్థలంలో పడడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగక పోవడంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.