మహారాష్ట్రలో మనిషిపై నేరుగా పడిన పిడుగు
మహారాష్ట్రలోని మజ్రీ బొగ్గుగని వద్ద పనికి వెళ్తున్న కార్మికునిపై అకస్మాత్తుగా నేరుగా పిడుగు పడింది. ఖాళీగా ఉన్న ఆ మైదాన ప్రాంతంలో నడిచి వెళ్లుతున్న వ్యక్తిపై ఎవరో కావాలని గురిపెట్టి షూట్ చేసినట్లుగా మెరుపుతో కూడిన పిడుగు పడింది. క్షణంలో బూడిదకుప్పగా మారిపోయాడు ఆవ్యక్తి. అందుకే వానలు పడేటప్పుడు ఒంటరిగా సమతల ప్రాంతాలలో ఒంటరిగా వెళ్లకూడదంటారు పెద్దలు. మృతుడు బీహార్‌కు చెందిన కూలీగా గుర్తించారు. ఎత్తైన చెట్లు, ఇనుప స్తంభాలు ఉంటే పిడుగు నేరుగా భూమిలోకి వెళ్లిపోతుంది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా పిడుగులు ప్రాణాలు తీసేస్తాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశమే ఉండదు. అందంగా కనిపించే ఆ మెరుపులలో వేలఓల్టుల విద్యుత్ ఉంటుంది.

