Andhra PradeshHome Page Slider

శ్రీశైలం జలాశయం 7 గేట్లు ఎత్తివేత

దేశవ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షాలతో ప్రాజెక్టులన్ని జల కళను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. దీంతో అధికారులు 7 గేట్లను 10 అడుగుల మేర ఎత్తారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో 4,02,960 క్యూసెక్కులుగా ఉంది. కాగా ఔట్ ఫ్లో 2,44,934 క్యూసెక్కులుగా ఉందని అధికారులు వెల్లడించారు.అయితే శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా..ప్రస్తుత నీటిమట్టం 883.50 అడుగులు చేరినట్లు అధికారులు పేర్కొన్నారు.