Home Page SliderNationalNews

వారికి జీవితఖైదే..కేంద్రమంత్రి

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆకతాయిలను తీవ్రంగా హెచ్చరించారు. విమానాలలో బాంబులంటూ ఈ మధ్య వస్తున్న హెచ్చరికలపై విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ప్రభుత్వంవిమానయాన భద్రతకి అత్యున్నత ప్రాధాన్యత  ఇస్తోందని పేర్కొన్నారు. బెదిరింపులకు పాల్పడేవారిని నోఫ్లై జాబితాలో చేర్చేలా చట్టాన్ని సవరిస్తున్నామని తెలిపారు. బెదిరింపు కాల్స్ కానీ, సోషల్ మీడియాలలో అబద్దపు పోస్టులు కానీ పెట్టేవారికి జీవిత ఖైదు విధించేలా చట్టం చేస్తామన్నారు. అంతర్జాతీయ విధి విధానాలను అనుసరించి విమానయాన సంస్థలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. అక్టోబర్ 14 నుండి దాదాపు 100 బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో విమానయాన భద్రతా నిబంధనల సవరణ అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. మొన్న శనివారం ఒక్కరోజు మాత్రమే 30కి పైగా విమానాలకు బెదిరింపులు వచ్చాయి. హోంశాఖ, ఇతర ఏజెన్సీలతో కలిసి వీటిపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.