Home Page SliderTelangana

తెలంగాణాకు ఆ రెండు పార్టీలతో విముక్తి ఖాయం

హైదరాబాద్: బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాల్లాంటివి. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అది బీఆర్ఎస్‌ని గెలిపిస్తుంది. హస్తానికి ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లే గుర్తుంచుకోండి. రాష్ట్రంలో స్కీములన్నీ స్కాములయ్యాయి. సకల జనుల విజయ సంకల్ప సభల్లో ప్రధాని మోడీ. కేంద్రంలో మేం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తే.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు, బీఆర్ఎస్ సర్కారు మాత్రం తగ్గించట్లేదు. బీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసుగుచెందారు. బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు. అన్ని వర్గాల సంక్షేమమే మా ధ్యేయం. దేశానికి బీసీని ప్రధానిని చేసిన బీజేపీ రాష్ట్రానికి బీసిని సీఎంను చేయడం అంత కష్టమేమీ కాదు, చేస్తుంది, చేసి తీరుతుంది. ఓబీసీలను కాంగ్రెస్ దారుణంగా అవమానించడమే కాకుండా.. ఆ పార్టీ నేతలు వారిని దొంగలంటున్నారు. ఈ ఎన్నికల్లో ఆ నేతల గర్వాన్ని, అహంకారాన్ని అణచివేయాలి. బీజేపీ పార్టీకి ఓటువేసి ఆశీర్వదించాలని ప్రధానిగా అడుగుతున్నాను. దేశం ముందుకు నడవాలంటే అది బీజేపీకే సాధ్యం అన్న విషయం గుర్తుపెట్టుకోండి.