అభివృద్ధికి ఓటేద్దాం.. ప్రలోభాలను పక్కన పెడదాం
తాము ఎన్నుకునే ఎమ్మెల్యే అభ్యర్థి తమ ప్రాంత అభివృద్ధితో పాటు అహర్నిశలు ప్రజల వెన్నంటే ఉండాలని పలువురు ఓటర్లు అభిప్రాయ పడుతున్నారు. ఎలాంటి ఒత్తిడులకు, ప్రలోభాలకు గురికాకుండా పోటీ చేసేవారిని ఆదరిస్తామంటున్నారు. ఎన్నికలపై మద్యం, నగదు ప్రభావం ఎక్కువగా ఉంటోందని అధిక శాతం మంది అభిప్రాయపడగా.. వీటిపై నిఘా పెంచాలని ఓటర్లు కోరుతున్నారు.