“ఉప్మా షియంకి ఉప్మా పెడదాం”: నాగబాబు
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా “వైసీపీ ప్రభుత్వం ఒక ఉప్మా ప్రభుత్వం” అని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పవన్ వాఖ్యలకు జనసేన నేత నాగబాబు మద్దతు తెలిపారు. అందరం కలిసి వచ్చే ఎన్నికల్లో ఉప్మా షియంకి ఉప్మా పెడదాం అని నాగబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. దీనితోపాటు పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోను నాగబాబు షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ ఏపీ రాజకీయాలలో తీవ్ర చర్చనీాయాంశమైంది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో బిజీగా ఉన్నారు. కాగా ఈ నెల 14న తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభమైన వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.

