Andhra PradeshNews

వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తా :జనసేన అధినేత పవన్ కళ్యాణ్

◆ఇప్పటం గ్రామం లో ఇళ్లు కూల్చివేత బాధితులకు చెక్కులు పంపిణీ
◆ఇళ్లు కూల్చివేత బాధితులకు ఒక్కొక్కరికి రూ. లక్ష ఆర్థికసాయం

ఏపీలో రానున్న ఎన్నికల్లో వైసీపీ ఎలా అధికారంలోకి వస్తుందో చూస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తనకు అండగా ఉన్న ఇప్పటం ప్రజలకు మద్దతుగా ఉంటానని బాధితులకు భరోసా కల్పించేందుకే రూ. లక్ష ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటంలో రోడ్డు విస్తరణ కక్షపూరితంగా చేశారని పరిహారం ఇవ్వకుండా ఇళ్లు కూలగొట్టడం బాధ కలిగించిందన్నారు. హైదరాబాద్‌లో భీమ్ రావ్ బస్తీని కూలగొట్టినప్పుడు ప్రశ్నించాననీ ఇప్పటంలో గడపలు కూల్చారని వైసీపీ గడప కూల్చేవరకు వదలిపెట్టనన్నారు. అధికారంలోకి వచ్చినా రాకున్నా బాధితులకు అండగా ఉంటాననీ ఇప్పటం గ్రామస్తులు చూపిన తెగువ అమరావతి రైతులు చూపించి ఉండాల్సిందని ప్రశ్నించారు. రైతులు తెగువ చూపించివుంటే అమరావతి కదిలేది కాదని 30 ఏళ్లు అధికారంలో ఉండాలని వైసీపీ కోరుకుంటోందని యువతకు మంచి భవిష్యత్ ఉండాలని జనసేన కోరుకుంటోందని పేర్కొన్నారు.

ఇప్పటం కూల్చివేత వెనుక సజ్జల పాత్ర ఉందని సజ్జల, వైసీపీ నేతలది ఆధిపత్య అహంకారమని వైసీపీ నేతల దాడులకు జనసేన భయపడదని ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తామని హెచ్చరించారు. మాట్లాడితే జనసేన పార్టీని రౌడీసేన అంటున్నారని మాది రౌడీసేన కాదని విప్లవసేన అని వైసీపీది రాజకీయ పార్టీ యా ఉగ్రవాద సంస్థనా అన్నారు. జనసేనకు అండగా ఉన్నవారిని బెదిరిస్తున్నారని మీ తాటాకు చప్పుళ్లకు మేం బెదరం – వీధి రౌడీలతో ఎలా ప్రవర్తించాలో మాకు బాగా తెలుసనన్నారు. వైసీపీ ఫ్యూడలిస్టిక్ గోడలు బద్దలు కొడతామని… అన్నింటికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాననీ… 2024 కీలకమైన ఎన్నికలని ప్రధానితో ఏం మాట్లాడామో సజ్జలకు ఎందుకని ప్రశ్నించారు. వైసీపీని దెబ్బకొట్టాలంటే ప్రధానికి చెప్పి చేయనని తానే కొడతానని అన్నారు. తన యుద్ధం తానే చేస్తాననీ ఇప్పటం గడపలు కూల్చారు.. తన గుండెల్లో గునపం దింపారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తానని సజ్జల రామకృష్ణారెడ్డికి సవాల్ విసిరారు.