‘ఆడుదాం ఆంధ్ర’ సరే, మైదానాలు ఎక్కడ?
నేటి నుండి 47 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమం జరగబోతోంది. నేడు ముఖ్యమంత్రి జగన్, గుంటూరు నల్లపాడులో ఈపోటీలను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు చుట్టుగుంట సెంటర్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ‘ఆడుదాం ఆంధ్ర సరే.. మైదానాలు ఎక్కడున్నాయి’? అంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలేవి? అంటూ మండిపడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలో ఈ పోటీలు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ పర్యటనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 వేల వార్డు, సచివాలయ స్థాయిలో పోటీలు జరుగుతాయని నిర్వహకులు పేర్కొన్నారు. 5 దశల్లో ఈ పోటీలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.22 కోట్లమంది క్రీడాకారులను రిజిష్టర్ చేసినట్లు తెలిపారు. 5 లక్షల స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర పతాకాన్ని, జాతీయ జెండాను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి జగన్. ఈ కార్యక్రమంలో మంత్రి రోజా, పలువురు నాయకులు, క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు.

