ఈరోజు ఎర్త్ అవర్ పాటిద్దాం- పర్యావరణాన్ని రక్షిద్దాం
ఈ రోజు ఎర్త్ అవర్‌ను ప్రపంచవ్యాప్తంగా పాటించబోతున్నారు. ఇది గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టడానికి, పర్యావరణాన్ని రక్షించుకునే ఉద్దేశ్యంతో పర్యావరణవేత్తలు ఏర్పాటు చేసిన పద్దతి. దీనిని మొదటిసారిగా 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మొదలుపెట్టారు. సాధారణంగా మార్చి నెల చివరి శనివారం దీనిని పాటిస్తారు. ఈ రోజున రాత్రి ఒక గంట పాటు విద్యుత్ ఉపకరణాలు అన్నింటినీ ఆపివేయాలని ప్రజలు స్వచ్చందంగా పాటించడమే. టీవీలు, కంప్యూటర్లు, లైట్లు, ఫ్యాన్‌లు వంటి గృహోపకరణాలను బంద్ చేసి, విద్యుత్‌ను ఆదా చేయడమే ఎర్త్ అవర్‌ను పాటించడం. రాత్రి 8.30 నిముషాల నుండి గంట పాటు అంటే 9.30 నిముషాల వరకూ ఈ ఎర్త్ అవర్‌ను ప్రజలు స్వచ్చందంగా పాటించాలి. భారత్‌లోని WWF-India దీనిని నిర్వహిస్తోంది.

ఈ సంవత్సరపు థీమ్‌గా Pedal for the Planet ను ప్రవేశపెట్టారు. మనం నివసించే భూమి కోసం ఒక గంట సమయాన్ని కేటాయించమని, పట్టణ ప్రాంతాలలో మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించమని, నిర్వాహకులు తెలియజేస్తున్నారు. రేపు ఉదయం ఏడు గంటలకు WWF-India, BYCS ఫౌండేషన్ కలిసి బెంగళూరులోని విధానసౌధ మెట్రో స్టేషన్ నుండి 7 కిలోమీటర్ల దూరం సైకిల్ మార్చ్‌ను నిర్వహించనున్నారు.

