‘ఏ ఒక్కఎమ్మెల్యేని కూడా వదులుకోం’-జగన్
ఎమ్మెల్యేలతో భేటీలో ‘ఏ ఒక్క ఎమ్మెల్యేని వదులుకోలేమంటూ’ కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీయం జగన్. ముందస్తు ఎన్నికలు రావని, అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. గడపగడపకు కార్యక్రమాన్ని ఉద్ధృతం చేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని పేర్కొన్నారు. అందరూ ఎవరి పనులు వారు చేయాలని, అప్పుడే 175 సీట్లు గెలుచుకుంటామని తెలియజెప్పారు. మంత్రివర్గంలో ఎలాంటి మార్పులు ఉండవని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచామని టిడిపి గొప్పలకు పోతోందని, కానీ 21 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే 17 స్థానాల్లో గెలిచామని గుర్తు పెట్టుకోమన్నారు. టిడిపి అసత్యప్రచారాలు చేస్తోందని, తమ ఎమ్మెల్యేలెవరూ అసంతృప్తిగా లేమని బొత్స సత్యనారాయణ వివరించారు. వచ్చే ఎన్నికలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు శాంపిల్ కాదని, లేనిది ఉన్నట్లుగా, లేనిది ఉన్నట్లుగా టిడిపి ప్రచారం చేస్తోందని జగన్ ఎమ్మెల్యేలకు క్లారిటీ ఇచ్చారు. నెలకు ఇరవై రోజులు ప్రజలతోనే ఉండాలని, ప్రజల్లో గ్రాఫ్ పెంచుకోవాలని , అవినీతి ఏమాత్రం లేకుండా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నామని ప్రజలకు తెలియజెప్పమని ఎమ్మెల్యేలకు దిశానిర్థేశం చేశారు.

