Home Page SliderNewsPoliticsTelanganatelangana,

‘పార్టీ జెండాలు వదిలి జాతీయజెండా పడదాం’..రేవంత్ రెడ్డి

పహల్గాంలో పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడి చాలా హేయమైనదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మృతులకు నివాళిగా హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌ పీపుల్స్ ప్లాజా నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకూ శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు రాజకీయాల కన్నా దేశప్రయోజనాలు ముఖ్యం అన్నారు. ‘పార్టీ జెండాలు పక్కన పెట్టి జాతీయ జెండా చేతపడతాం..’ అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. దేశం కోసం 140 కోట్ల మంది భారతీయులు ప్రధాని మోదీకి మద్దతుగా ఉన్నారని, ఉగ్రవాద నిర్మూలనకి ఎలాంటి చర్యలు చేపట్టినా తెలంగాణ ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ని లాక్కుని భారత్‌లో కలిపేయండి అంటూ వ్యాఖ్యానించారు. గతంలో ఇందిరాగాంధీ దేశ ప్రయోజనాల కోసం పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను విడదీసినప్పుడు వాజపేయి ఆమెను దుర్గామాతగా పిలిచారని, మోదీ దుర్గామాత భక్తులుగా ఇప్పుడు పాకిస్తాన్‌ను రెండుగా విడదీయండి అంటూ సూచించారు.