Andhra PradeshHome Page Slider

చంద్రబాబు, జగన్ ఇళ్లకు హోమ్ టూర్ చేద్దాం..పేర్ని నాని

వైసీపీ నేత పేర్నినాని టీడీపీ నేతలకు సవాల్ విసురుతున్నారు. జగన్ ఇళ్లపై, వైసీపీ కార్యాలయాలపై తప్పుడు రాతలు రాయొద్దని హెచ్చరించారు. జగన్ ఇంటిని, హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటిని హోమ్‌టూర్ వీడియోలు చేద్దాం సిద్దమేనా అని ఛాలెంజ్ చేస్తున్నారు. సిట్టింగ్ జడ్జితో జగన్ ఇళ్లపై విచారణ చేయించుకుందాం అంటూ సవాల్ చేశారు. జగన్‌పై విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారని, ఆయన ఎక్కడికీ వెళ్లడని, తాడేపల్లి ఇంట్లో నుండే 2029లో గెలిచేవరకూ రాజకీయాలు చేస్తారని తనకు విశ్వాసం ఉందన్నారు. ప్రజల్లో ఆయనకు ఎంత పేరు ఉందో, ఎంత విశ్వాసం ఉందో తెలుసన్నారు.అది తట్టుకోలేక టీడీపీ పార్టీ దుష్ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. జగన్‌ను చంద్రబాబు, సోనియా కలిసి 16 నెలలు జైలులో పెట్టినా లొంగలేదని, కేవలం ఎన్నికలలో ఓడిపోయినంత మాత్రాన ఎవ్వరికీ లొంగరన్నారు. వైసీపీని కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికీ విలీనం చేసే ప్రశ్నే లేదని, మీలా పొత్తులు పెట్టుకుని గెలిచే కర్మ జగన్‌కు పట్టలేదని విమర్శించారు.