Home Page SliderInternationalPolitics

‘కెనడాను కొనేస్తాం’..ట్రంప్ తనయుడి సంచలన పోస్ట్

అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే రకరకాల ప్రకటనలతో ఇతర దేశాలను భయపెడుతున్నారు. కెనడా, మెక్సికోలకు సహాయాన్ని ఆపేస్తామని అమెరికాలో రాష్ట్రంగా మార్చుకుంటామని ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్ చేసిన ఒక పోస్టు సంచలనంగా మారింది. ఆన్‌లైన్‌లో కెనడా, గ్రీన్‌లాండ్, పనామా కాలువను కొనేస్తామంటూ ఆర్డర్ పెట్టినట్లు ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ దేశాలను ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో ట్రంప్ చూస్తున్నట్లుగా, దానిని కార్ట్‌లో పెట్టినట్లు ఈ ఫోటో ఉంది. నిజంగానే ఇటీవల జరిగిన ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ పనామా కాలువను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. పనామా దేశం అమెరికా వాణిజ్య నౌకల నుండి భారీ ఫీజులు విధిస్తోందని, వాటిని తగ్గించాలన్నారు.