తిరుమలలో మరోసారి చిరుత పులి కలకలం..
తిరుమల జనావాసాల్లోకి చిరుతల సంచారం పెరిగిపోతోంది. దీంతో ప్రజలంతా ఏ పక్క నుంచి ఏ ప్రమాదం పుంజుకోవస్తోందని బిక్కు బిక్కుమంటూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నివసిస్తున్నారు. తిరుమలలో మరోసారి చిరుత పులి కలకలం రేగింది. తిరుమల అలిపిరి మార్గంలో గాలి గోపురం షాపుల దగ్గర తెల్లవారుజామున ఒంటి గంటకు చిరుత పులి కదలికలు అక్కడి సీసీటీవిలో రికార్డయ్యాయి. చిరుత సంచారంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

