Home Page Slidertelangana,

మహిళపై చిరుత దాడి..

ఆదిలాబాద్ జిల్లాలో చిరుతల సంచారం అధికారులను, ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే పలువురిపై దాడి చేసిన చిరుత తాజాగా ఒక మహిళపై దాడి చేసింది. డెడ్రా గ్రామం సమీపంలో ఈ దాడి జరిగింది. ఆమె తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. దీనితో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవలే ఒక మహిళపై దాడి చేయగా, ఆమె మరణించింది. ఇప్పుడు మరో మహిళపై దాడి చేయడంతో బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. పులి బారి నుండి గ్రామాన్ని రక్షించే ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరుతున్నారు.