Home Page SliderNational

తమిళిసైకు వ్యతిరేకంగా లెఫ్ట్ డీఎంకే దూకుడు, తిరిగి రాజకీయాల్లోకి వస్తే తప్పేంటంటున్న బీజేపీ

పదవులకు ఆశపడే తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందర్య రాజన్, తిరిగి తమిళనాడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారంటూ విమర్శలు మోత మోగుతోంది. తమిళిసై, తెలంగాణ గవర్నర్ గా ఏం ఘనకార్యాలు చేశారని వారు ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి, మోదీ కేబినెట్‌లో బెర్త్ దక్కించుకోవాలన్న కోరిక తప్పించి తమిళిసై.. రాజకీయాల్లోకి తిరిగి ప్రవేశించడానికి పెద్దగా కారణాలు లేవని లెఫ్ట్, డీఎంకే పార్టీలు మండిపడుతున్నాయ్. వచ్చే ఎన్నికల్లో తమిళిసైని ఓడించి తీరుతామని ఉభయపక్షాలు దీమా వ్యక్తం చేస్తున్నాయి.

గవర్నర్ పదవిని చేపట్టిన తిరిగి బీజేపీలో చేరడంపై తమిళిసై సౌందరరాజన్‌పై వామపక్షాలు, డీఎంకే విమర్శలకు తమిళనాడు డీఎంకే ఘాటుగా బదులిస్తోంది. ఉన్నత పదవుల్లో ఉన్నవారు పదవులకు రాజీనామా చేసి… సాధారణ వ్యక్తులుగా, ప్రజల కోసం మళ్లీ పనిచేయడం బీజేపీలో మాత్రమే సాధ్యమవుతుందన్నారు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై. బీజేపీ కాకుండా ఇతర రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నత పదవులను వదులుకోవాల్సి వస్తే వెనుకంజ వేస్తారన్నారు. వారికి రాజకీయాల్లో ఉండటం అంటే కేవలం ఉన్నత పదవులు దక్కించుకోవడమేనన్నారు.

తమిళసై గవర్నర్‌గా చాలా బాగా పనిచేశారు. ఆ పదవిని వదులుకుని మళ్లీ రాజకీయాల్లోకి రావడం సౌందరరాజన్‌కు ప్రజలపై ఉన్న ప్రేమను తెలియజేస్తుందని చెప్పారు.ఆమె మళ్లీ బీజేపీలో చేరడం పార్టీ పట్ల ఆమెకున్న నిబద్ధతను తెలియజేస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరుసగా మూడోసారి అధికారం చేపట్టినప్పుడు ఆయనకు మద్దతుగా తమిళనాడు రాజకీయాల్లో క్రీయాశీలకం కావడం చిన్న విషయం కాదన్నారు. సౌందరరాజన్ 2019లో తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టకముందే బీజేపీకి రాజీనామా చేశారు. ఆమె 2021లో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు. అరవై రెండేళ్ల తమిళిసై సౌందరర్యరాజన్ గైనకాలజిస్ట్, ఆమె రెండు దశాబ్దాల క్రితం బీజేపీలో చేరారు.