Andhra PradeshHome Page Slider

‘జీతం వదిలేస్తున్నా’..పవన్ కీలక వ్యాఖ్యలు

తాను తీసుకున్న పంచాయితీ శాఖలో నిధుల్లేవని, తవ్వే కొద్దీ అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. తాను దేశం కోసం, నేల కోసం పని చేస్తున్నానని అందుకే జీతం వదిలేస్తున్నా అని కీలక వ్యాఖ్యలు చేశారు పవన్. గత ప్రభుత్వంలో పంచాయితీ నిధులు ఎటు వెళ్లాయో తెలియడం లేదన్నారు. వందల కోట్లతో వైజాగ్ రుషికొండలో ప్యాలెస్ కట్టారు. ఆ నిధులను ఉపయోగిస్తే కొంతైనా అభివృద్ధి జరిగేది. పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజక వర్గంగా తీర్చిదిద్దాలనేదే తన ఆశ అన్నారు. కాలుష్యం లేని పరిశ్రమలను ఇక్కడికి తీసుకురావాలన్నారు. తనకు ప్రజలలో సుస్థిర స్థానం కావాలన్నారు. భారీ మెజార్టీ ఇచ్చిన పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. క్యాంపు ఆఫీసులో ఎలాంటి మరమ్మతులు చేయించడం లేదని, అవసరమైతే ఫర్నిచర్ తానే తెచ్చుకుంటానన్నారు. నాకు డబ్బులు సంపాదించాలనో, కొత్తగా పేరుప్రతిష్టలు సంపాదించాలనో లేదు. ప్రజలలో సుస్థిర స్థానం కావాలి. మా పార్టీకి ఓటు వేయకపోయినా అర్హత ఉన్నవారికి పెన్షన్లు ఇస్తాం. ప్రజలందరికీ ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుంది. అని పవన్ క్లారిటీ ఇచ్చారు.