పొట్టు పొట్టు కొట్టుకున్న నాయకులు..
హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీయూసీ సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఐఎన్టీయూసీ సంజీవ రెడ్డి వర్గం, ఐఎన్టీయూసీ(ఆర్) అంబటి కృష్ణమూర్తి వర్గాల నాయకులు ఒకరిపై ఒకరు తిట్టుకుంటూ దాడికి పాల్పడ్డారు. ఐఎన్టీయూసీ(ఆర్) నేషనల్ ప్రెసిడెంట్ అంబటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ ను సంజీవారెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ అడ్డుకున్నారు. సమాచాం అందుకున్న అబిడ్స్ పోలీసులు జోక్యం చేసుకొని సంజీవ్ రెడ్డి వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు.