Home Page SliderTelangana

పీసీసీ చీఫ్ పదవి కోసం ఢిల్లీలో నాయకుల పడిగాపులు

గత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో పీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే ప్రచారం సాగుతోంది. దీనికోసం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారు. హైకమాండ్‌ను మెప్పించి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షపదవిని పొందాలని చూస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో మంత్రివర్గ విస్తరణ, కొత్త పీసీసీ చీఫ్ నియామకాలపై చర్చిస్తున్నారు. మరో ఆరుగురిని మంత్రి వర్గంలో తీసుకునే అవకాశాలున్నాయి. పీసీసీ చీఫ్ పదవి కోసం జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బలరాం నాయక్, మహేశ్ కుమార్ గౌడ్,సంపత్ కుమార్, మధుయాష్కీ ప్రయత్నిస్తున్నారని సమాచారం.