Andhra PradeshHome Page Slider

సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాల నేతలు

ఏపీలో ఉద్యోగ సంఘాల నేతలు ఇవాళ సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ కార్యదర్శి శివారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..సీఎం జగన్ ఉద్యోగుల సమస్యలను చాలా వరక పరిష్కరించారన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన మాటను సీఎం నిలబెట్టుకున్నారని శివారెడ్డి తెలిపారు. సీఎం జగన్ ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలర్ చేయడం ద్వారా 23 ఏళ్ల నిరీక్షణ ఫలించిందన్నారు. అయితే తాజాగా సీఎం జగన్ ఉద్యోగులకు 12 వ పీఆర్సీ ప్రకటించినందుకు సంతోషంగా ఉందని శివారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు మంచి చేస్తున్నందుకు శివారెడ్డి ఏపీ ఉద్యోగ సంఘాల తరుపున సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.