Home Page SliderTelangana

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద నేతల సందడి

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరవాత వెలువడిన ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం నింపింది. పలువురు అభ్యర్థులు, నాయకులు శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చి ఆయనని కలిశారు. తమ నియోజకవర్గాల్లో పోలింగ్ సరళిని తెలియజేశారు. తాము విజయం సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేస్తూ.. అందుకు కలిసివచ్చిన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై నేతల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఏ పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయనే అంశంపైనే వారు చర్చించినట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా పలు సంస్థలు కాంగ్రెస్ గెలవబోతోందని వెల్లడించినందున ఓట్ల లెక్కింపు వరకూ ఈవీఎంల భద్రతపై అప్రమత్తంగా ఉండాలనే నేతలంతా అభిప్రాయపడ్డారని సమాచారం. ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్యనే జరిగింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ వస్తుందనే ధీమాతో ఉన్నాం అని కాంగ్రెస్ అభిప్రాయపడింది.