ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియం ముస్తాబవుతోంది
హైదరాబాద్: తెలంగాణ నూతన సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇతర శాఖల ఉన్నతాధికారులు పరిశీలించారు. చేస్తున్న ఏర్పాట్లు, బందోబస్తు తదితర అంశాలపై డీజీపీ, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులను సీఎస్ అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ నేతలతో పోలీసు, సాధారణ పరిపాలన శాఖ అధికారులు చర్చించారు. సీఎల్పీ నేతగా ఎంపికైన రేవంత్ రెడ్డి గురువారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.