Breaking Newshome page sliderHome Page SliderNationalNewsPoliticsviral

సుప్రీంకోర్టు సీజేఐపై షూ విసిరిన లాయర్

ఢిల్లీ: సోమవారం సుప్రీం కోర్టులో సంచలన సంఘటన జరిగింది. ఒక న్యాయవాది కోపంతో భారత ప్రధాన న్యాయమూర్తి ( సీజేఐ) BR గవాయ్ పై దాడి చేయడానికి ప్రయత్నించాడు. న్యాయవాది కోర్టు బెంచ్ ముందు వెళ్లి, తన షూ తీసి, దాన్ని CJI గవాయ్ పై విసరాలనుకున్నాడు. అయితే, కోర్టు భద్రతా సిబ్బంది వెంటనే జోక్యం చేసుకుని, న్యాయవాదిని బయటకు తీసుకెళ్లారు. అతను బయటకు వెళ్ళిపోతూ, “సనాతన్ కా అప్మాన్ నహీ సహెంగే” (సనాతన ధర్మాన్ని అవమానం చేయలేము) అని అరుస్తూ వెళ్లాడు. ఈ సంఘటనపై స్పందించిన CJI గవాయ్ “ఇలాంటి నాకు ప్రభావం చూపవు. మనం దృష్టిని కోల్పోకుండా, కోర్టు కార్యకలాపాలను కొనసాగించాలి” అని అనడం విశేషం. ఈ ఘటన కోర్టు భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు రేకెత్తించింది, అయితే CJI గవాయ్ సహనంతో కూడిన స్పందనను కోర్టులో హాజరైనవారు అభినందించకుండా ఉండలేకపోయారు.