Home Page SliderTelangana

చట్టం ఎవరికీ చుట్టం కాదు..

అల్లు అర్జున్ అరెస్టుపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అరెస్టు చట్ట ప్రకారమే జరిగిందని అన్నారు. అల్లు అర్జున్ పై ప్రభుత్వానికి ఎలాంటి కక్ష లేదని.. చట్టం ఎవరికీ చుట్టం కాదని అన్నారు సీతక్క. అల్లు అర్జున్ అరెస్ట్ వెనక ప్రభుత్వ హస్తం ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా.. జైలు నుంచి విడుదలైన బన్నీని పరామర్శించేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా క్యూ కట్టారు. అల్లు అర్జున్ ని కలిసి పరామర్శించిన వారిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు, డైరెక్టర్ హరీష్ శంకర్, హీరో రానా, ఆర్, నారాయణ మూర్తి, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, డైరెక్టర్ కొరటాల శివ తదితరులు ఉన్నారు.