“వైసీపీ హయాంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి”: సీఎం చంద్రబాబు
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయన్నారు. కాగా వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలను తప్పుడు కేసులతో జైల్లో పెట్టి వేధించిందని సీఎం ఆరోపించారు. ఈ మేరకు జేసీ ప్రభాకర్‌పై 66 కేసులు,చింతమనేని ప్రభాకర్‌పై 48 కేసులు,పులివర్తి నానిపై 31 కేసులు,దేవినేని ఉమపై 27 కేసులు,నిమ్మల రామానాయుడిపై 20 కేసులు,నల్లమిల్లి రామాకృష్ణా రెడ్డిపై 19 కేసులు,చంద్రబాబుపై 17 కేసులు,లోకేష్‌పై 17 కేసులు,జీవీ ఆంజినేయులుపై 17 కేసులు,పరిటాల శ్రీరామ్‌పై 15 కేసులు,అచ్చెన్నాయుడిపై 15 కేసులు నమోదు చేశారని సీఎం అసెంబ్లీలో వెల్లడించారు.