Home Page SliderNational

మహేష్-రాజమౌళి చిత్రంపై లెటెస్ట్ బజ్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం తర్వాత 29వ సినిమాని గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో చేయనున్నాడు. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఈ చిత్రం ఇప్పట్లో మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు కానీ, షూటింగ్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. ఒక అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. సన్నివేశాలతో షూటింగ్‌ని విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఆల్‌రెడీ రాజమౌళి కొన్ని ప్రదేశాలని లాక్ చేసి ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్‌లని మొదలు పెట్టాలనుకుంటున్నారట. మహేష్ రాజమౌళి కాంబినేషన్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో వేచిచూడాలి.