Home Page SliderNational

‘లాస్ట్ డేట్..లాస్ట్ ఛాన్స్’… ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌కు వెల్లువెత్తిన రిటర్నులు

నేడు (జూలై 31) ఐటీ రిటర్న్ ఫైల్ చేయడానికి చివరి రోజు కావడంతో  గంటల సమయంలోనే లక్షలమంది ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్నారు. ఈ రోజు లోపల ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే రేపటి నుండి అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం 1961, సెక్షన్ 234 ఎఫ్ ప్రకారం ఐదు లక్షల లోపు ఆదాయం గల వారు 1000 రూపాయలు. అంతకు మించి ఉన్నవారు 5,000 రూపాయలు అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. నెలకు ఒక శాతం సాధారణ వడ్డీని కూడా చెల్లించాలి. లేదంటే ఐటీ శాఖ నోటీసులు పంపిస్తుంది. అప్పటికి కూడా నిర్లక్ష్యం చేస్తే చెల్లించాల్సిన పన్నులపై 50 శాతం నుండి 200 శాతం వరకు జరిమానా పడడమే కాకుండా ఇతర చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారు. అందుకే నేడు మధ్యాహ్నం 12 నుండి 1 గంట మధ్యలో ఏకంగా 3.39 లక్షల మంది రిటర్నులు దాఖలు చేసినట్లు ఐటీ శాఖ ట్విటర్ ద్వారా తెలియజేసింది. ఈ రోజులో 1 గంట వరకూ మొత్తం 11.03 లక్షల ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ అయ్యాయని పేర్కొంది. మరోపక్క నేటి ఉదయం నుండి హ్యాష్‌ట్యాగ్ ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కొందరు టైమ్ పెంచాలని కోరుతున్నారు.