ఎట్టి పరిస్థితిలో భూసేకరణ ఆగదు..
లగచర్లలో భూసేకరణ ఆగదని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన కలెక్టర్ ప్రతీక్ జైన్ ను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశా లు కల్పించేందుకే ముఖ్యమంత్రి పరిశ్రమ లు తెస్తున్నారని చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్న అధికారులు, కలెక్టర్ పై కేటీఆర్, హరీశ్ రావు ఉసిగొల్పిన కొందరు దాడి చేశారని చెప్పారు. పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ ఆడిన ఆటలో పావుగా మారారని అన్నారు. కుట్ర, ధ్వంస రచనలో భాగమయ్యారని ఆరోపించారు.