Andhra PradeshNews

Jr.NTR రాజకీయాల్లోకి రావాలి అంటున్న లక్ష్మీ పార్వతి

తెలుగు ,సంస్కృతి అకాడమీ అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా Jr.NTRతో భేటి కావడంపై ఆమె స్పందించారు. ఈ మేరకు Jr.NTR రాజకీయాల్లోకి రావాలని ఆమె ఆకాక్షించారు. అంతేకాకుండా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి టీడీపీనీ స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అదే తన కోరిక అని ఆమె స్పష్టం చేశారు. చంద్రబాబు దుర్మార్గుడు కాబట్టే  మహానేత ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నారని లక్ష్మీ పార్వతి ఆరోపించారు.

మరోప్రక్క స్వర్గీయ గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ జయంతి సందర్భంగా గిడుగు బాషా ఉత్సవాలను ఎస్వీ యూనివర్శిటీ వేదికగా ఈ నెల 25న నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా రేపు ఆరుగురిని పురస్కార గ్రహీతలుగా ఎంపిక చేస్తామన్నారు.

అనంతరం ఆమె చంద్రబాబు గురించి మాట్లాడుతూ..చంద్రబాబు హయాంలో ప్రభుత్వం విద్యాశాఖను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. దీని కారణంగానే గత ప్రభుత్వ హయాంలో దాదాపు 30 వేల స్కూల్స్ మూతపడ్డాయన్నారు.

అయితే విద్యావ్యవస్థల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత సీఎం జగన్‌కు మాత్రమే దక్కుతుందన్నారు. దీనిపై కొందరు పలు రకాల విమర్శలు చేస్తూ..తెలుగు భాషాభివృద్దికి కృషి చేస్తున్నామంటున్నారు. కానీ వీళ్లు మాత్రం తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమాలలో ఎందుకు చదివిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. పేద పిల్లలకు ఆంగ్ల భాషను అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత సీఎం జగన్‌కే చెందుతుందన్నారు. దీనిని ఓర్వలేని కొందరు సీఎం జగన్ తెలుగుకు ద్రోహం చేశారని అవాస్తవాలు మాట్లాడుతున్నారని వాటిని ఆమె తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో తెలుగు స్కూల్స్‌ను పెద్ద సంఖ్యలో మూసివేశారన్నారు. తెలుగు ,సంస్కృత అకాడమీకి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుపతి గోశాల వద్ద స్థలం కేటాయించారని వెల్లడించారు.