ఈ రంగంలో లక్షలాది ఉద్యోగాలు
సంప్రదాయ రవాణా రంగం కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని లాజిస్టిక్స్‌గా మారి అనేక ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. ఇప్పుడు ఈ రంగం ఉద్యోగ కల్పనలో ఎవర్ గ్రీన్‌గా నిలిచింది. రోడ్డు, రైలు, జల, ఆకాశ రవాణా రంగాలు లాభసాటిగా మారింది. ఈ రంగంలో టాప్ బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏలు చేసిన ప్రొఫెషనల్స్ నుండి సరుకును వాహనాలకు ఎత్తే కార్మికుల వరకూ రకరకాల ఉద్యోగాలు ఈ రంగంలో ఉన్నాయి. కొనుగోళ్లు, నిల్వ, రవాణా, డెలివరీ వంటి అనేక దశలలో నిర్వహణ బాధ్యతలు నిర్వహించడానికి ఉద్యోగులు కావలసి వస్తుంది. రాబోయే ఐదేళ్లలో ఈరంగంలో అపారమైన ఉద్యోగావకాశాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకప్పుడు సరుకు బదలాయింపుగా మాత్రమే ఉండే ఈ రంగం ఇప్పుడు లాభసాటి పరిశ్రమగా మారడంతో ప్రపంచస్థాయి సంస్థలు అడుగుపెట్టాయి.

