‘డిసెంబర్‌లో లక్ష గృహప్రవేశాలు’..చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ డిసెంబర్‌లో లక్ష గృహప్రవేశాలు చేసేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఏపీలోని పేదలకు గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్ల భూమి ఇచ్చి ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ కాలంలో విధ్వంసానికి గురయిన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని, రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలగకుండా పట్టుదలతో కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. నక్కపల్లి, కొప్పర్తి వంటి పారిశ్రామిక జోన్‌లకు రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.


 
							 
							