అత్యంత కాలుష్య గుప్పిట్లో లాహోర్
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా పాకిస్తాన్ లోని లాహోర్ సిటీ నిలిచింది. రెండు రోజుల క్రితం ఇక్కడి గాలి నాణ్యత 1900 పాయింట్లకు క్షీణించింది. దీంతో లహోర్ అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. తక్షణ చర్యలుగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అలాగే ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని సూచించారు. అలాగే మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సీనియర్ మంత్రి పంజాబ్ మరియమ్ ఔరంగజేబు సూచించారు. అలాగే కలుషితమైన గాలి పీల్చి పలువురికి అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

