Home Page SliderNational

స్టూడెంట్ తో లేడీ ప్రొఫెసర్ పెళ్లి..

క్లాస్ రూమ్ లోనే ఓ స్టూడెంట్ తో మహిళా ప్రొఫెసర్ పెళ్లి చేసుకుంది. బెంగాల్ ప్రభుత్వ నిధులతో నడిచే ఒక విశ్వవిద్యాలయంలో పెళ్లి తంతు జరగడం గమనార్హం. అయితే అది ప్రెషర్స్ వెల్ కం ప్రోగ్రాంలో జరిగిన డ్రామా అని మహిళా ప్రొఫెసర్ చెబుతున్నారు. ఈ ఘటనపై యూనివర్సిటీ అధికారులు విచారణకు ఆదేశించారు. విచారణ కమిటీ రిపోర్టు సమర్పించే వరకు మహిళా ప్రొఫెసర్ ను సెలవుపై వెళ్లమని కూడా చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. పశ్చిమ బెంగాల్ నదియాలోని హరింఘటలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ లో ఈ ఘటన చోటుచేసుకుంది. టీచర్లు, ఇతర సిబ్బంది, విద్యార్థులు.. వారిని ఉత్సాహపరుస్తూ సెల్ఫీలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించి జనవరి 9న హల్ది వేడుక, జనవరి 14న మెహందీ, సంగీత్ వేడుకల జాబితాతో కూడిన ఈ-ఇన్విటేషన్ ను కూడా రూపొందించారు.