Home Page SliderTelangana

హైదరాబాద్‌లో ప్రారంభమైన లేడీస్ స్పెషల్ బస్సు

హైదరాబాద్‌లో ఇప్పటికే మహిళల కోసం పలు ఫ్రీ బస్సు సర్వీసులను  ప్రభుత్వం  అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో లేడీస్ కోసం మరో స్పెషల్ బస్సును ఆర్టీసీ ప్రారంభించింది. ఈ బస్సు JNTU-వేవ్‌రాక్ మార్గంలో ప్రతిరోజు ఉదయం,సాయంత్రం నడుస్తుంది. మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం త్వరలోనే మరిన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలుపుతూ..ఆయన ట్వీట్ చేశారు.కాగా  ఐటీ కారిడార్‌లో రాకపోకలకు ఈ సదుపాయాన్ని మహిళలు వినియోగించుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు.