కర్నూలు: నీటి కుంటలో శవమై తేలి.. అనుమానాస్పద మృతి
కౌతాళం: కౌతాళం మండలంలోని బాపురం గ్రామంలో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. గ్రామానికి చెందిన జీవప్ప, మల్లమ్మ దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. చివరి కుమార్తె మాల చలువాది లక్ష్మి (21) కర్ణాటక సరిహద్దులోని ఓ రైతు పొలంలోని నీటి కుంటలో ఆదివారం శవమై తేలింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అగసలదిన్నె గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ మాలనాగన్న అనే యువకుడి వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు లక్ష్మి తల్లి మలమ్మ ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. యువకుడు లక్ష్మిని పెళ్లి చేసుకోవాలని గత కొన్ని నెలలుగా వేధిస్తున్నాడని కుటుంబసభ్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కుటుబసభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని నీటికుంట నుంచి బయటకు తీసి శవపరీక్ష నిమిత్తం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

