“కుర్చీ మడతపెట్టి సాంగ్” సరికొత్త రికార్డ్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమా “గుంటూరు కారం”.కాగా ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. కాగా మడతపెట్టి ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో 300 మిలియన్ వ్యూస్ సాధించింది. దీంతో టాలీవుడ్‌లో అత్యంత వేగంగా అంటే కేవలం 133 రోజుల్లోనే 300 మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్‌గా రికార్డ్ సృష్టించింది.అయితే దీని తర్వాత స్థానంలో అరబిక్ కుతు(157రోజులు),బుట్ట బొమ్మ(158 రోజులు),ఊ అంటావా(265 రోజులు) సాంగ్స్ ఉన్నాయి.

