Andhra PradeshHome Page Slider

కుప్పం బరిలో పెద్దిరెడ్డి… చంద్రబాబుతో అమీతుమీ

బాబూ వస్తావా.. కుప్పంలో పోటీకి సై
చంద్రబాబుకు పెద్దిరెడ్డి డైరెక్ట్ సవాల్
రా చూసుకుందామంటూ ప్రకటన
కుప్పం, పుంగనూరు ఎక్కడైనా ఓకే!

టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి ఓ రేంజ్‌లో సవాల్ విసిరారు. కుప్పం పర్యటనలో వైసీపీపైనా, తనపైనా చేసిన విమర్శలకు ఘాటు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు రండి, కుప్పంలో తేల్చుకుందాం… అక్కడా.. ఇక్కడా కాదంటూ ఓ రేంజ్‌లో ఆహ్వానం పలికారు. సీఎం జగన్ ఆదేశిస్తే తాను కుప్పంలో చంద్రబాబుపై బరిలో దిగుతానన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు కుప్పంలో డిపాజిట్ దక్కదన్నారు. అదే సమయంలో చంద్రబాబు పుంగనూరు రావాలన్నారు పెద్దిరెడ్డి. కుప్పం, పుంగనూరు రెండు చోట్లా పోటీకి తాను సిద్ధమన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబుకు ప్రజలు రాజకీయ సమాధి కడతారన్నారు. ఇష్టం వచ్చినట్టు కారుకూతలు కూస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏడుపును ప్రజలు నమ్మబోరన్నారు. చంద్రబాబుకు తిట్టడం తప్ప వేరే పని లేదన్నారు. ఇలాగే మాట్లాడితే చంద్రబాబు జిల్లాలో పోటీ చేసే పరిస్థితి ఉండదన్నారు. పండగపూట కూడా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు పెద్దిరెడ్డి.