Home Page SliderNational

కుంభమేళా తొక్కిసలాట..పెరుగుతున్న మృతులు

పర్వదినమైన మౌని అమావాస్యను పునస్కరించుకుని, త్రివేణి సంగమం వద్ద పవిత్రస్నానానికి జనాలు పోటెత్తారు. భారీ సంఖ్యలో జనాలు తోసుకురావడంతో మహా కుంభమేళాలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు సమాచారం. ఈ తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో మృతదేహాలు వెలికి వస్తున్నాయి. ఇప్పటి వరకూ దాదాపు 20 మంది మృతి చెందినట్లు సమాచారం. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. నేటి స్నానానికి నిన్నటి నుండే భారీ సంఖ్యలో చేరుకున్నారు. తాకిడి ఎక్కువై, బారికేడ్లు విరిగి తొక్కిసలాట జరిగింది. గంగా,యమునా సంగమస్థానమైన సెక్టార్ 2 ఘాట్ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ మరణాల సంఖ్యపై ఇప్పటి వరకూ యూపీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ప్రధాని మోదీ పలుమార్లు ఫోన్ చేసి, సమాచారం తెలుసుకున్నారు. ఈ కుంభమేళాకు వెళ్లే జాతీయ రహదారిపై భారీ రద్దీ నెలకొంది. దీనితో దాదాపు 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 40 కిలోమీటర్లకు పైగా భారీ ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుంది.

Breaking news: మహా కుంభమేళాలో ఘోరం..17 మంది మృతి