కనకవృష్టిని కురిపిస్తున్న కుంభమేళా
కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌కు దాదాపు నెల రోజులుగా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో రోడ్లపై రద్దీ భారీగా పెరిగిపోయింది. రైల్వే స్టేషన్, విమానాశ్రయం నుంచి త్రివేణి సంగమ ప్రాంతానికి వెళ్లడానికే గంటల సమయం పడుతోంది. ట్రాఫిక్ వల్ల సాధారణ ట్యాక్సీ, రిక్షా సేవలు స్తంభించిపోతున్నాయి. ఈ ప్రతికూల పరిస్థితినే క్యాష్ చేసుకుంటున్నారు స్థానిక యువత. భక్తులకు ట్రాఫిక్ తిప్పలు తప్పేలా స్థానిక కాలేజీ విద్యార్థులు స్కూటర్లు, బైక్‌లతో ట్యాక్సీ సేవలు అందిస్తున్నారు. యువకులతో పాటు అమ్మాయిలు కూడా వివిధ రకాల మోటార్ సైకిళ్లతో విద్యార్థులు భక్తులను సంగమ ప్రాంతానికి చేరవేస్తూ తాత్కాలిక ఉపాధి పొందుతున్నారు. ఒక రైడ్‌కు రూ.100 నుంచి రూ.1000 వరకు ఛార్జ్ చేస్తున్నారు.చాలా మంది కాలేజీ విద్యార్థులు బైక్ ట్యాక్సీ నడుపుతున్నారు. రోజుకు రూ.3000 నుంచి రూ.5000 వరకు సంపాదిస్తున్నారు. అయితే విద్యార్థులే కాకుండా కొంతమంది ఉగ్యోగులు కూడా ఈ తాత్కాలిక ఉపాధిని పొందుతున్నారు. ఇలా కొందరు బైక్ ట్యాక్సీ సేవలను అభినందిస్తుంటే మరికొందరు అధిక ఛార్జీలను విమర్శిస్తున్నారు. ట్యాక్సీకి బదులు తమ లగేజీతో మోస్తూ నడకమార్గం ఎంచుకుంటున్నారు.