కుల్దీప్ జాదూ.. వెస్టిండీస్ కుప్పకూలింది!
భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకే ఆలౌటైంది.
భారత్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణిస్తూ ఐదు వికెట్లు, రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టి విండీస్ బ్యాటర్లను చిత్తు చేశారు. ఆ జట్టులో అలిక్ అథనేజ్ 41 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.
ఇక ముందు ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీగా 518/5డిక్లేర్ చేయగా, దాంతో భారత్ 270 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
ఫాలో-ఆన్‌లో బ్యాటింగ్‌కి దిగనుంది వెస్టిండీస్.