కూకట్‌పల్లి సీటు జనసేనకే.. అభ్యర్థి ప్రేమకుమార్
హైదరాబాద్: కూకట్‌పల్లి నియోజకవర్గం నుండి జనసేన పార్టీ బరిలోకి దిగింది. పొత్తులో భాగంగా బీజేపీ ఈ సీట్‌ను జనసేనకు కేటాయించింది. పార్టీ అభ్యర్థిగా ముమ్మారెడ్డి ప్రేమకుమార్‌ను ఖరారు చేసింది. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌లు భేటీ అయ్యారు. ఆ తరువాత జరిగిన పరిణామాలలో భాగంగా ప్రేమకుమార్‌కు పార్టీ టిక్కెట్ లభించింది.